ENGLISH

గుంటూరు కారం.. తొలి రోజు ఎంత?

13 January 2024-14:28 PM

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన  'గుంటూరు కారం' మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.  ఫామిలీ ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించగలిగింది. మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్  సినిమాకు ప్లస్ అయ్యింది. కానీ సంక్రాతి రేస్ లో రావటం వలన 'గుంటూరు కారం' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌  బానే వచ్చాయి. హిట్ టాక్ తో సంబంధం లేకుండా, మహేష్ పేరుతో బిజినెస్  బానే జరిగింది.  రివ్యూస్, రేటింగ్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద వసూళ్లు సాధించింది.


మహేష్‌ సినిమాలకు ఓవర్సిస్‌ పరంగా మంచి క్రేజ్‌ ఉంది. పోకిరి సినిమా నుంచి మినిమమ్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటుతున్నాయి. యూఎస్‌ బాక్సాఫీసు దగ్గర మహేష్‌ సినిమాలు బానే వసూల్ చేస్తాయి. అందరి ఎక్స్‌పెక్టేషన్‌ మించేలా గుంటూరు కారం ఓవర్సీస్ వసూళ్ల సునామీ సృష్టించింది. మొదటి రోజు 20 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.
   

తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం 31.2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌తో యావరేజ్ ఓపెనింగ్ సాధించింది. మహేష్ నటించిన సినిమాకి ఇదే అత్యధిక ఓపెనింగ్స్. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా సుమారు 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వచ్చినట్టు సమాచారం. మొత్తం ఓవర్సీస్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఏపీ/టీఎస్ బిజినెస్ కలిపి అన్ని రకాలుగా  135 కోట్ల వసూల్ సాధించింది. 200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. కలెక్షన్లకు సంబంధించి చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.