రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలంటారు. మహేష్‌బాబు తన కొత్త సినిమా 'స్పైడర్' తమిళ ప్రమోషన్ కోసం, చెన్నయ్ కబుర్లు చెబుతున్నాడు. ఇప్పుడంటే తెలుగు సినీ ప్రముఖులంతా హైదరాబాద్‌లో ఉన్నారుగానీ, ఒకప్పుడు వీళ్ళంతా చెన్నయ్ కేంద్రంగా ఎదిగినవారే. అందుకే మన హీరోల్లో దాదాపు అందరికీ తమిళంలో మాట్లాడటం వచ్చు. తెలుగులో కన్నా తమిళంలో అనర్గళంగా మాట్లాడే హీరోలున్నారు. మహేష్‌బాబు కూడా చెన్నయ్‌లోనే పెరిగాడు. అందుకే అతనికి తమిళం బాగా వచ్చు. తమిళ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన మహేష్, తన చిన్ననాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు. తమిళ హీరో విజయ్, మహేష్‌కి మంచి స్నేహితుడట. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాల్సి ఉందట. చెన్నయ్ ఈ మధ్యకాలంలో బాగా మారిపోయిందంటూ నాటికీ, నేటికీ పరిస్థితుల గురించి కామెంట్ చేశాడు. చెన్నయ్ అంటే చాలా ఇష్టమనీ ఎప్పటినుంచో తమిళంలో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదనీ, ఇప్పటికి 'స్పైడర్' రూపంలో ఆ లోటు తీరిందని చెప్పాడు మహేష్. ఆల్రెడీ 'బాహుబలి' తమిళంలో సత్తా చాటింది. 'బాహుబలి2' సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ తమిళనాడులోనూ గట్టిగా చేస్తున్నారు. మహేష్ 'స్పైడర్' కూడా తమిళనాడులో సత్తా చాటితే తెలుగు సినిమా పరిధి ఇంకా పెరిగినట్లవుతుంది. తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలను ఆరాధిస్తున్నట్లే, తెలుగు హీరోలని తమిళ ఆడియన్స్ కూడా ఆరాధించే రోజు రావాలని ఆశిద్దాం.
ALSO READ: 'బాహుబలి2' అధిగమించేసింది