ENGLISH

త్రివిక్ర‌మ్ కి ఓకే చెప్పేస్తాడా?

30 August 2020-14:08 PM

టాలీవుడ్ లో మ‌రో హ్యాట్రిక్ కాంబినేష‌న్‌కి రంగం సిద్ధం అవుతోంది. అత‌డు, ఖ‌లేజాలో అభిమానుల్ని అల‌రించిన మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్.. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప‌ని చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడో, ఎప్పుడో చెప్ప‌టం క‌ష్టం గానీ, ఇప్పుడు ఈ కాంబినేష‌న్ మాత్రం హ్యాట్రిక్ కొట్ట‌డానికి పూర్తి స‌న్నాహాలు చేస్తోంది. ఇటీవ‌ల మ‌హేష్‌బాబు - త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌.. చ‌ర్చలు సాగాయి.

 

ఇది సినిమా కోస‌మే అని టాక్‌. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట` ఒప్పేసుకున్నాడు. ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయాలి. కానీ.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` పూర్త‌యితే గానీ, ఎన్టీఆర్ కాల్షీట్లు దొర‌క‌వు. ఈ లోగా టైమ్ వేస్ట్ చేయ‌డం త్రివిక్ర‌మ్ కి ఇష్టం లేదు. అందుకే మ‌హేష్ ని లైన్ లో పెట్టాడు అని టాక్‌. కానీ.. మ‌హేష్ చేతిలో `స‌ర్కారు వారి పాట‌` ఉంది. అది పూర్త‌యితే గానీ, త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లవ్వ‌దు. రెండు సినిమాల్నీ ఒకేసారి మొద‌ల‌య్యే అవ‌కాశాలూ లేక‌పోలేదు. అయితే.. మ‌హేష్ ఏం నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి.

ALSO READ: టెంప‌ర్ లాంటి క‌థ‌లో... ప‌వ‌ర్ స్టార్‌!