ENGLISH

మ‌హేష్‌, విజ‌య్‌ల మ‌ల్టీస్టార‌ర్‌?

10 January 2022-15:35 PM

ప్ర‌స్తుతం మల్టీస్టార‌ర్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. స్టార్ హీరోలు క‌ల‌సి న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వాటి వ‌ల్ల సినిమాల క్రేజ్ అమాంతం పెరుగుతోంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌ర‌వాత మ‌హేష్ బాబు మరో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు అందుకు రంగం సిద్ధం అవుతోంద‌ని టాక్‌. తాజా సంచ‌ల‌నం... విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌హేష్ బాబు క‌లిసి న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తాడ‌ట‌.

 

ప‌ర‌శురామ్ ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలోనే మ‌హేష్ కి మ‌రో క‌థ చెప్పాడ‌ట. ఆక‌థ కూడా మ‌హేష్ కి బాగా న‌చ్చింద‌ని టాక్‌. ఒక‌వేళ స‌ర్కారు వారి పాట హిట్ట‌యితే... ప‌ర‌శురామ్ కి మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌హేష్ డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఇది మ‌ల్టీస్టార‌ర్ క‌థ కాబ‌ట్టి, మ‌రో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ ని తీసుకుంటాడ‌ట‌. విజ‌య్ - ప‌ర‌శురామ్ కాంబోలో `గీత గోవిందం` వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ అడిగితే విజ‌య్ కాద‌న‌డు. పైగా మ‌హేష్ తో మ‌ల్టీస్టార‌ర్ కాబ‌ట్టి, ఇది క్రేజీ కాంబో అవుతుంది. సో.. టాలీవుడ్ లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కి రంగం సిద్ధం అయిన‌ట్టే.

ALSO READ: కరోనా బారిన నటి ఇషా చావ్లా