ENGLISH

మ‌హేష్‌బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది

09 August 2020-09:57 AM

ఆగ‌స్టు 9.... మ‌హేష్‌బాబు పుట్టిన రోజు. ప్ర‌తీ యేడాదీ ఈ రోజున మ‌హేష్ కొత్త సినిమాకి సంబంధించిన టీజ‌రో, ట్రైల‌రో, ఫ‌స్ట్ లుక్కో బ‌య‌ట‌కు రావ‌డం రివాజు.  ఈసారి... `స‌ర్కారువారి పాట‌` నుంచి మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చింది. మ‌హేష్ లుక్ ఇది వ‌ర‌కే విడుద‌ల చేశారు కాబ‌ట్టి.. ఈసారి మ‌హేష్ లుక్ చూపించ‌లేదు. కానీ... టైటిల్ లోగో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. త‌మ‌న్ త‌న‌దైన శైలిలో బీజియ‌మ్ కొట్టాడు.  ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. లేదంటే.. ఈపాటికి టీజ‌రో, డైలాగో బ‌య‌ట‌కు వ‌చ్చేసేది. మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో మ‌హేష్ అభిమానుల హంగామా ఉధృతంగా ఉంది. ల‌క్ష‌ల్లో ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగుల‌తో హోరెత్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో మ‌హేష్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లే ట్రెండింగ్ లో ఉన్నాయి. సెల‌బ్రెటీలంతా... ఈరోజు మ‌హేష్ నామ స్మ‌ర‌ణ చేస్తున్నారు.  


మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. మ‌హేష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ``అందం, అభిన‌యం భ‌గ‌వంతుడు మీకిచ్చిన వ‌రం. మ‌రెన్నో మ‌ర్చిపోలేని పాత్ర‌లు చేయాల‌ని, మీ క‌ల‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటున్నా`` అంటూ ట్వీట్ చేశారు. 

ALSO READ: 'క‌న‌బ‌డుట లేదు' టీజ‌ర్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌