ENGLISH

ప్రభాస్ తో మరో మల్లు హీరో

07 October 2024-12:52 PM

దేశ వ్యాప్తంగా అందరి ద్రుష్టి ప్రభాస్ పైనే ఉంది. డార్లింగ్ వరుస హిట్లతో రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. సలార్, కల్కి లతో 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. బాలీవుడ్ హీరోల్ని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. హను రాఘవ పూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా పూజా కార్య క్రమాలు ముగించుకుని షూటింగ్ జరుగుతోంది. సలార్ 2, కల్కి 2 ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక మిగిలింది  సందీప్ వంగాతో చేయబోయే  'స్పిరిట్'. ఈ మూవీ పై ఆడియన్స్ లో విపరీత మైన ఆసక్తి ఉంది. 


సందీప్ హీరో ఎలివేషన్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్శంట్ మ్యాచ్ అవుతాడని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి తో విజయ్ దేవర కొండకి, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ మూవీతో రణబీర్ కి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.  సూపర్ స్టార్ ముమ్ముట్టి స్పిరిట్ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి తెలుగులో 1990 ల్లో 'స్వాతి కిరణం' మూవీ చేసారు. రీసెంట్ గా 'యాత్ర', అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు సందీప్ వంగా డైరక్షన్లో పాన్ ఇండియా స్థాయిలో మెరవనున్నారు.  


ఇప్పటికే ఈ మూవీలో కరీనా కపూర్ హీరోయిన్ గా, సైఫ్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. దీనితోనే అంచనాలు పీక్స్ కి చేరగా , ఇప్పుడు ముమ్ముట్టి కూడా నటిస్తుండటంతో సందీప్ వంగా ఎదో భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు, షూటింగ్ 2024లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ మూవీ సందీప్ గత చిత్రాలకి భిన్నంగా ఉంటుందని టాక్. హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కి సంగీతం అందిస్తున్నారు.