ENGLISH

మంచువారింట అసలేం జరుగుతోంది?

09 December 2024-17:17 PM

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏంటో అన్నది పూర్తిగా బయటికి రావటం లేదు. గత కొన్నాళ్లుగా మంచు వారసులు మధ్య విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మంచులక్ష్మి కూడా హైదరాబాద్ వదిలి ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. మనోజ్ ని దూరం పెట్టారు మోహన్ బాబు. చివరికి మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప లో కూడా వీరిని తీసుకోలేదు. విష్ణు ఇద్దరు కూతర్లు, కొడుకు ఈ  పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. కానీ మోహాన్ బాబు వారసులు అయిన మనోజ్, లక్ష్మి లేకపోవువటం గమనార్హం. ఇపుడు మంచు వారింట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

శనివారం రాత్రి మోహన్ బాబు మనోజ్ పై దాడి చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. మనోజ్ శరీరం నిండా దెబ్బలతో హాస్పటల్లో చికిత్స కోసం రావటం, పోలీసుల ఎంక్వైరీతో ఈ విషయాలు బయటికి వచ్చాయి.  పహాడీ షరీఫ్‌ పరిధిలో ఉన్న మోహన్‌బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతుండగా, విద్యాసంస్థల వాటాల్లో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అనచరుడు 'వినయ్ తో పాటు  ఇతర బౌన్సర్లు మనోజ్, భార్య మౌనికపై దాడికి దిగినట్టు సమాచారం. ఆ గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలసి పహాడీ షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసినట్టు టాక్.

ఇదే విషయంపై స్పందించిన పోలీసులు మంచువారింటి నుంచి డయల్ 100 కి కాల్ వచ్చింది కానీ, వ్యక్తిగతంగా ఎవరూ కంప్లైంట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ గాయపడిన మనోజ్ మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లగా, పోలీసులు పలు ప్రశ్నలు వేశారని కానీ మనోజ్-మౌనిక మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఆదివారం ట్రీట్ మెంట్ తీసుకున్న మనోజ్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డిశ్శార్జ్ అయ్యాడు. మనోజ్ ఒంటి మీద  దెబ్బలు ఉండడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలు, మెడ భాగంలో తీవ్ర గాయాలైనట్టు, సిటీ స్కాన్‌, ఆల్ట్రా సౌండ్‌ పరీక్షలు పూర్తి చేసినట్టు వైద్యులు తెలిపారు. 24 గంటల పాటూ అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పినా సోమవారం మళ్లీ వస్తానని చెప్పి మనోజ్ డిశ్సార్జ్ అయి వెళ్లిపోయినట్టు  తెలిపారు డాక్టర్స్.

ఆ టైం లో విష్ణు దుబాయ్ లో ఉన్నట్లు, ఈ విషయం తెలియటంతో వెంటనే హైద్రాబాద్ చేరుకున్నాడని టాక్. దీనిపై స్పందించిన మోహన్ బాబు 'మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని కొట్టిపడేశారు. మనోజ్ ను కొట్టించాననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో నిజం లేదంటూ ట్వీట్టర్లో పోస్ట్ పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయొద్దన్నారు మోహన్ బాబు.

ALSO READ: ఫస్ట్ డే కలక్షన్స్ తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే