ENGLISH

తమిళనాట మంచు మనోజ్‌ సందడి

23 August 2017-15:44 PM

తెలుగులోనే కాదు, తమిళ తంబీలకీ మంచు మనోజ్‌ సుపరిచితుడే. గతంలో 'ఎన్నై తెరియుమా' అనే తమిళ సినిమాలో నటించాడు మనోజ్‌. అక్కడ ఆ సినిమాకి మంచి ఆదరణ లభించింది. తాజాగా మరో చిత్రంతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు మంచు మనోజ్‌. 'నాన్‌ తిరుంబ వరివేన్‌' సినిమా త్వరలో విడుదల కాబోతోంది. తమిళుల స్వాతంత్య్రం కోసం ఓ నాయకుడు చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓ మంచి నాయకుడు అనూహ్య పరిస్థితుల కారణంగా అదృశ్యమైతే, ఎప్పటికైనా, ఏ రకంగానైనా, ఎవరో ఒకరి రూపంలోనైనా తిరిగొస్తాడు అని చెప్పే కథే ఈ సినిమా. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు మంచు మనోజ్‌. యదార్ధ గాధల ఆధారంగా తెరకెక్కే చిత్రాలంటే మనోజ్‌కి చాలా ఇష్టం. అందుకే ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాడు. అజయ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో పక్క తెలుగులో 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో నటిస్తున్నాడు మంచు మనోజ్‌. కమర్షియల్‌ సినిమాల కన్నా, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ స్టోరీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు మనోజ్‌. హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించేయాలి అనేదాని కన్నా. తన సినిమా ద్వారా సమాజానికి ఎంత మేర మేలు కలుగుతుందనే ఆలోచిస్తాడు మనోజ్‌. అందుకే మనోజ్‌కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన్ని ప్రత్యేకంగా అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు. తమిళుల గురించి చాలా విషయాలు ఈ సినిమా ద్వారా తెలియ చెప్పే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్‌.

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి