ENGLISH

విష్ణు 'మంచు' లాంటి మనసు

27 January 2025-13:27 PM

ఈ మధ్య మంచు ఫ్యామిలీ వివాదాల వలన విష్ణు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఇప్పడు కూడా మరొకసారి వార్తల్లో నిలిచాడు విష్ణు. అయితే ఈ సారి ఫ్యామిలీ వివాదాలు, మనోజ్ తో గొడవలు, సినిమాల విషయం కాదు. మంచు విష్ణు మంచి మనసుకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వారి వివాదాలను పక్కన పెట్టి విష్ణుని ప్రశంసిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంచు విష్ణు ఓ ప్రకటన చేసాడు. అదేంటి అంటే త్రివిధ దళాల్లో పని చేసే వారికోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు విష్ణు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో పనిచేసే తెలుగువారి పిల్లలు మోహన్ బాబు యూనివర్సిటీలో చదివితే 50 పర్శంట్ స్కాలర్ షిప్ ఇస్తామన్నట్టు ప్రకటించారు. వారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండనవసరం లేదు. ఎక్కడ ఉన్నవారు అయినా MBU లో చదివితే వారికి ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. అన్ని కోర్సులకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయం పై విష్ణు మాట్లాడుతూ 'మన దేశం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలపాలని ఈ కార్యక్రమం చేపట్టాను. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే వారికి అండగా నిలవాలని అనుకున్నాను. అందుకే మా యూనివర్సిటీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. వేరే యూనివర్సిటీలు కూడా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను' అని తెలిపాడు.

నిజంగానే విష్ణు దారిలో మరికొన్నియూనివర్సిటీలు పయనిస్తే మన సైనికులకి సరైన గుర్తింపు, గౌరవం లభించినట్టే. విష్ణు ఇలాంటి మంచి పని చేయటం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వాళ్ళ బాధ్యతలు మొత్తం చూసుకుంటున్నాడు.

ALSO READ: పుష్ప రాజ్ కమిట్ మెంట్స్ మాములుగా లేవుగా