ENGLISH

డ‌బుల్ డోస్ ఇవ్వ‌బోతున్న మంచు విష్ణు

23 November 2020-10:25 AM

మంచు విష్ణు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా... `ఢీ`. విష్ణుకు అందిన తొలి సూప‌ర్ హిట్. ఆ సినిమాతో శ్రీ‌నువైట్ల పేరు కూడా మార్మోగిపోయింది. బ‌డా హీరోలు సైతం... శ్రీ‌నువైట్ల‌తో ప‌నిచేయ‌డానికి మ‌క్కువ చూపించ‌డం మొదొలెట్టారు. ఈ సినిమా వ‌చ్చి ప‌ద‌మూడేళ్ల‌య్యింది. ఇప్పుడు విష్ణు - శ్రీ‌ను వైట్ల‌లు క‌లిసి ఢీ సీక్వెల్ చేయ‌బోతున్నారు.

 

ఈ సినిమాకి సంబంధించిన డీటైట్స్ ఇవీ.. ఈ సీక్వెల్ కి `ఢీ అండ్ ఢీ` అనే పేరు పెట్టారు. డ‌బుల్ డోస్ అన్న‌ది ఉప‌శీర్షిక‌. మంచు విష్ణునే నిర్మాత‌. శ్రీ‌నువైట్ల ఆస్థాన ర‌చ‌యిత గోపీ మోహ‌న్ స్క్రిప్టు అందిస్తున్నారు. మణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి సంగీతం అందిస్తున్నారు. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ బాధ్య‌త తీసుకున్నారు. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది.

ALSO READ: ‘ఆచార్య’ రేంజ్‌ ఆ రేంజ్‌లో వుంటుందా?