ENGLISH

20 కోట్ల సినిమా.. కొనే నాధుడే లేడు

18 March 2021-17:35 PM

చేతిలో హిట్టు లేక‌పోతే, ఎంతోటి వాడికైనా `బిజినెస్` ఉండ‌దు. ఎన్ని కోట్లు పెట్టి తీసినా ఉప‌యోగం ఉండ‌దు. `మోస‌గాళ్లు` సినిమాకి ఇదే ప‌రిస్థితి ఎదురైంది. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా త‌న స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిన సినిమా ఇది. కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లు ఈ సినిమాకి అండ‌గా ఉన్నారు. క‌థ‌పై న‌మ్మ‌కంతో.. దాదాపు 20 కోట్లు ఖ‌ర్చు పెట్టేశాడు విష్ణు. అయితే ఈ సినిమాని ఎవ్వ‌రూ కొన‌లేదు. శుక్ర‌వారం ఈసినిమా విడుదల అవుతోంది.

 

ఒక్క బ‌య్య‌ర్ కూడా ఈ సినిమాని కొన‌డానికి ముందుకు రాక‌పోవ‌డంతో విష్ణునే స్వ‌యంగా ఈ సినిమాని విడుద‌ల చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి శాటిలైట్ , ఓటీటీ బిజినెస్ కూడా జ‌ర‌గ‌లేద‌ని టాక్‌. కాజ‌ల్ ఉన్నా క‌నీసం ఓ టీ టీకి ఈ సినిమా అమ్ముడుపోలేదంటే.. ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. శుక్ర‌వారం విడుద‌లై, మంచి టాక్ వ‌స్తే త‌ప్ప‌, ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ మొద‌లు కాదు. శుక్ర‌వారం.. మ‌రో రెండు సినిమాలు (చావు క‌బురు చ‌ల్ల‌గా, శ‌శి) పోటీలో ఉన్నాయి. వాటిని త‌ట్టుకోవ‌డం... మోస‌గాళ్లకు సాధ్యం అవుతుందా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.

ALSO READ: రంగ్‌దే.. అంత బిజినెస్ చేసిందా?