ENGLISH

స్వల్ప గాయాలతో బతికి బయట పడ్డ మంగ్లీ

18 March 2024-12:59 PM

టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలిసిన ఆమె ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. స్మాల్ స్క్రీన్ తో తన జర్నీ స్టార్ట్ చేసి, తన టాలెంట్ తో వెండి తెరకి పరిచయం అయ్యి, హార్డ్ వర్క్ తో  అంచెలంచెలుగా ఎదిగి,  టాప్ సింగర్ గా కొనసాగుతోంది మంగ్లీ. తెలుగులోనే కాకుండా  మిగతా భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారింది.


తన డిఫరెంట్ వాయిస్ తో వరస అవకాశాలు చేజిక్కుంచుకుంటూ  ప్రొఫెషనల్ సింగర్స్ కు గట్టి పోటీ ఇస్తోంది మంగ్లీ. ఆమె ఏ పాట పాడినా అది కచ్చితంగా హిట్ అన్న ముద్ర పడింది. దీంతో మంగ్లీ కి డిమాండ్ పెరిగింది. అది ఎలాంటి పాట అయినా తన వాయిస్ తో మెస్మరైజ్ చేస్తోంది.  క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్ పాట ఏదయినా తన గాత్రంతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది.  ఓ వైపు సినిమా  అవకాశాలతో పాటు టెలివిజన్ షో లకి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తోంది,       


రీసెంట్ గా మంగ్లీ ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండపల్లి వంతెన దగ్గర మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో డీసీఎం వారి వాహనాన్ని ఢీ కొట్టిందని సమాచారం. మంగ్లీతో ప్రయాణించిన మేఘరాజ్, మనోహర్ లకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. మంగ్లీ కారును ఢీ కొట్టిన డీసీఎం వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు. మంగ్లీ కారు వెనుక భాగం బాగా దెబ్బతింది.