ENGLISH

మారుతి హ‌ర్ట‌య్యాడ‌ట‌.. అందుకే

08 January 2021-17:00 PM

ఎట్ట‌కేల‌కు ఓ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు మారుతి. గోపీచంద్ తో సినిమా చేస్తున్నా అని మారుతి అధికారికంగా ప్ర‌క‌టించేశాడు. నిజానికి.. చివ‌రి క్ష‌ణాల వ‌ర‌కూ ర‌వితేజ‌తో సినిమా ఓకే చేయిద్దామ‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు మారుతి. ర‌వితేజ కూడా.. `చూద్దాం.. చేద్దాం` అంటూనే త‌ప్పించుకుని తిరిగాడ‌ట‌. రెండ్రోజుల క్రితం... మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు ర‌వితేజ. ఈ సంద‌ర్భంగా మారుతి సినిమా ఉందా? అని అడిగితే... ర‌వితేజ నుంచి స‌మాధానం రాలేదు. `ఖిలాడీ` త‌ప్ప కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేద‌న్నాడు. అంటే.. `మారుతి సినిమా లేదు` అంటూ ప‌రోక్షంగా చెప్పేసిన‌ట్టే.

 

దాంతో మారుతి హర్ట్ అయ్యాడ‌ట‌. ఇప్ప‌టికిప్పుడు ఓ అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వ‌డానికి కార‌ణం కూడా ర‌వితేజ వైఖ‌రే అని తెలుస్తోంది. నిజానికి మారుతి.. రెండు టీజ‌ర్లు రెడీ చేశాడు. ఒక‌టి ర‌వితేజ‌తో సినిమా చేస్తున్నా అని చెప్ప‌డానికి, మ‌రోటి... గోపీచంద్ తో సినిమా ఉంది అని చెప్ప‌డానికి. ఏది వీలైతే అది వ‌దులుదాం అనుకున్నాడు. మారుతి టార్గెట్ సంక్రాంతి పండ‌క్కి. ఎప్పుడైతే... ర‌వితేజ నుంచి ఎలాంటి క‌దలికా లేదో.. వెంట‌నే.. గోపీచంద్ తో సినిమా ఉంద‌ని ప్ర‌క‌టించేశాడు.

ALSO READ: మరో రీమేక్‌ని లైన్‌లో పెడుతున్న మెగాస్టార్