లై సినిమాతో ఆకట్టుకుంది మేఘా ఆకాష్. ఈమధ్య `రాజ రాజ చోర`తో ఓ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `డియర్ మేఘ`లో నటించింది. నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలో చేయడం మేఘకు ఇదే తొలిసారి. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు, అంచనాలు పెట్టుకుంది. వచ్చే నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదో ప్రేమకథ. యూత్‌ఫుల్ గా ఉండబోతోందట.
ఈ సందర్భంగా తన లవ్ స్టోరీని సైతం గుర్తు చేసుకుంది. ''నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్. ప్రేమంటే ఏంటో తెలియని వయసది. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను'' అని చెప్పుకొచ్చింది.
''వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా మార్చేసేది ప్రేమ ఒక్కటే. తల్లిదండ్రుల ప్రేమ కొన్నాళ్లు పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ పిల్లల ప్రేమ.. ఇలా మన లైఫ్ లోని అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. నా దృష్టిలో ప్రేమ గొప్పది అది నిస్వార్థమైనది'' అని ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది మేఘ.
ALSO READ: Megha Akash Latest Photoshoot