ENGLISH

ముళ్ల‌పూడి టైటిల్ తో సినిమా.

29 August 2020-12:06 PM

కోతి కొమ్మ‌చ్చి అన‌గానే.. ముళ్ల‌పూడి - బాపుల జీవితం గుర్తొస్తుంది. వాళ్ల జీవిత క‌థ‌ని... `కోతి కొమ్మచ్చి` పేరుతో పుస్త‌కంగా తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ టైట‌ల్ తో ఓ సినిమా వ‌స్తోంది. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `శ‌త‌మానం భ‌వ‌తి`తో ఓ సూప‌ర్ హిట్ కొట్టారు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `ఎంత మంచివాడ‌వురా` అనుకున్న ఫ‌లితం తీసుకురాలేదు.

 

ఇప్పుడు మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదే `కోతి కొమ్మచ్చి`. శ్రీ‌హ‌రి త‌న‌యుడు మేఘాంశ్, స‌తీష్ వేగేశ్న‌త‌న‌యుడు స‌మీర్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇది పూర్తి వినోద భ‌రిత‌మైన చిత్ర‌మని, పేరుతో ఉన్న స్వ‌చ్ఛ‌త‌... సినిమాలోనూ ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈరోజు స‌తీష్ వేగేశ్న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

ALSO READ: మౌనమే సమాధానం అంటున్న సుక్కు?