రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'జీఎస్‌టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) వీడియో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోతో మరో పోర్న్ స్టార్ మియా మల్కోవా ఇండియన్ సినిమాకి పరిచయమవుతోంది. ఇంతవరకూ పోర్న్ రంగం నుండి వచ్చి ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటిన ముద్దుగుమ్మ సన్నీలియోన్ ఒక్కతే. ఇప్పుడు మియా మల్కోవా సన్నీలియోన్‌ని మించి సత్తా చాటడానికి వచ్చేస్తోంది.
ఇండియన్ సినిమాపై తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి మియా మల్కోవా చాలానే కష్టపడుతోంది. ఇదిలా ఉండగా, ఆమెని ఇప్పటికే పలువురు భారతీయ దర్శకులు సంప్రదించారనే గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి. మరో పక్క ఇప్పుడు సన్నీలియోన్ మేనియా కూడా కాస్త తగ్గినట్లే అనిపిస్తోంది. ఈ తరుణంలో మియా ఈ టైంని ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. మరో విషయం ఏంటంటే, సన్నీలియోన్ పోర్న్ రంగాన్ని వద్దనుకుని ఇండియన్ సినిమాకి వచ్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని యూజ్ చేసుకుని వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా తనదైన ముద్ర వేసుకుంది.
అయితే మియా మల్కోవా ఇంకా పోర్న్ రంగంలో యాక్టివ్‌గానే ఉంది. అలాంటప్పుడు ఈ హాట్ భామ అక్కడా ఇక్కడా ఎలా టైం కేటాయిస్తుందో చూడాలి మరి. మరో పక్క బాలీవుడ్ నుండి, టాలీవుడ్ దాకా సినిమాల ట్రెండ్ కూడా మారింది. హాట్ సినిమాలకు ప్రాధాన్యత పెరిగింది. దాంతో ఈ తరహా హాట్ స్టార్స్‌కి ఇండియన్ సినిమాలో ఛాన్సెస్ బాగానే వస్తున్నాయి. చూడాలి మరి ఈ కొత్త హాట్ స్టార్ మియా మల్కోవా తన హాట్ టాలెంట్‌ని ఎలా ప్రదర్శించనుందో!
ALSO READ: GST పైన అమ్మాయిలతో ఆర్జీవీ హాట్ డిబేట్