ENGLISH

ఆ సినిమాని మోహ‌న్ బాబు రీమేక్ చేస్తున్నాడా?

19 October 2020-15:00 PM

మ‌ల‌యాళ చిత్రాల హ‌వా ఇప్పుడు బాగా క‌నిపిస్తోంది. అక్క‌డ విజ‌వంత‌మైన చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా ఓ మ‌ల‌యాళ చిత్రంపై మ‌న‌సు పారేసుకున్నట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఓటీటీ ద్వారా విడుద‌లైన మ‌ల‌యాళ చిత్రం 'ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్ 5.25' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు మోహన్‌ బాబు ఆసక్తిగా ఉన్నారట.

 

ఈ చిత్రానికి రతీష్‌ బాలకృష్ణన్ పొదువల్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కే రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని మోహ‌న్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మోహ‌న్ బాబు కి రీమేక్ లు కొత్తేంకాదు. ఆయ‌న కెరీర్‌లో అత్య‌ధిక హిట్లు అందించిన‌వి రీమేకులే. అందుకే... మ‌రోసారి రీమేక్‌పై దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ నిర్మాత‌ల‌తో మోహ‌న్ బాబు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని, వీటిపై త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌మాచారం.

ALSO READ: బాల‌య్య నిజంగా సాయం చేశాడా?