ENGLISH

మోనాల్‌ దెబ్బ.. ఈసారి పడే వికెట్‌ ఎవరిది?

27 October 2020-11:30 AM

ఇది బిగ్‌ బాస్‌ కోటా కాదు.. మోనాల్‌ గజ్జర్‌ కోటా.! ఏ వారం ఎవరు ఎలిమినేట్‌ అయినా, దాన్ని మోనాల్‌ గజ్జర్‌ కోటాలో పడేస్తున్నారు బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌. మోనాల్‌ గజ్జర్‌ వికెట్‌ పడాల్సింది.. ఆమెను తప్పించి, ఇంకొకర్ని ఎలిమినేట్‌ చేసేస్తున్నారనే భావన బలపడిపోతోంది. ఈ వారం ఎలిమినేషన్‌ కోసం నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. అందులో అమ్మ రాజశేఖర్‌ సహా అఖిల్‌ సార్థక్‌, అరియానా గ్లోరీ, మెహబూబ్‌ దిల్‌సే తదితరుల పేర్లు ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం ఫైనల్‌ అయ్యాయి. ఇందులో మెహబూబ్‌కి ఫాలోయింగ్‌ బయట చాలా తక్కువగా వుంది.

 

అరియానా అనూహ్యంగా పుంజుకుంది. అమ్మ రాజశేఖర్‌కి సింపతీ వర్కవుట్‌ అవుతోంది. మరి, ఎవరి వికెట్‌ పడిపోవాలి.? మోనాల్‌ గజ్జర్‌ వికెట్‌ పడాల్సి వున్నా, ఆమె ఎలాగూ సేఫ్‌ అయిపోతుంది. ఎందుకంటే, ఆమెకు బిగ్‌బాస్‌ అండ వుంది. ‘తొలుత మోనాల్‌ని పంపించెయ్యండి.. ఆమె వల్లే హౌస్‌ అర్థం పర్థం లేకుండా నడుస్తోంది.. హౌస్‌మేట్స్‌ రియల్‌ టాలెంట్‌ బయటకు రావడంలేదు..’ అని నెటిజన్లు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.

 

కానీ, మోనల్‌ లేకపోతే, హౌస్‌లో ట్రయాంగిల్‌ స్టోరీ నడవదు కదా.! దీన్ని ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా బిగ్‌బాస్‌ టీం అభివర్ణిస్తున్నా, అంత సీన్‌ లేదని జనం తేల్చేస్తున్నారు. దాదాపుగా ప్రతివారం నామినేషన్స్‌ టైంలో ఏదో ఒక రకంగా మోనల్‌ ఇష్యూ వస్తోంది. అది కాస్తా ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తోంది. కాగా, ఈ వారం అమ్మ రాజశేఖర్‌ ఔట్‌ అవుతాడనే చర్చ గట్టిగా జరుగుతోంది.

ALSO READ: నెట్ ఫ్లిక్స్ కోసం క్రిష్‌?