ENGLISH

మోనాల్‌ పులిహోర మామూలుగా లేదుగా.!

03 November 2020-16:16 PM

గ్లామర్‌ కోసమే మోనాల్‌ గజ్జర్‌ని బిగ్‌హౌస్‌లోకి తీసుకున్నారా.? అంటే, అంతకు మించి ఏదో ‘పులిహోర’ వ్యవహారం కోసం ఆమెను కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారన్న విషయం షో మొదలైన నాలుగైదు రోజుల్లోనే అందరికీ అర్థమయిపోయింది. ఓ స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చి మరీ ఆమెను కంటెస్టెంట్‌గా ఎంపిక చేసినట్లే కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఆ ప్యాకేజీ ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. హీరోయిన్‌గా ఓ మోస్తరు బిజీగా వుండి వుంటే, మోనాల్‌ గజ్జర్‌కి ఎలాంటి రెమ్యునరేషన్‌ వచ్చేదో.. దానికి నాలుగైదు రెట్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేలా ప్యాకేజీని ఆమె ముందు పెట్టారనీ, ఆమె ఓకే చెప్పిందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

అయితే, అంతలా ఆమెకు ప్యాకేజీ ఇచ్చి హౌస్‌లోకి ఎందుకు తీసుకొచ్చినట్లు.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మోనాల్‌, ఇంతవరకు హౌస్‌లో పెద్దగా చేసిందేమీ లేదు.. పులిహోర కలపడం తప్ప. జస్ట్‌ ఓ ‘కీ’ బొమ్మలా నడుస్తోంది మోనాల్‌ వ్యవహారం. ఏడవమంటే ఏడవడం, నవ్వమంటే నవ్వడం.. ఇది తప్ప రియాల్టీ కనిపించడంలేదనే పెద్ద కంప్లయింట్‌ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో మోనాల్‌పై వస్తోంది. మొన్నామధ్య మోనాల్‌ మద్దతుదారులు, నటుడు సోనూ సూద్‌కి రిక్వెస్ట్‌ పెట్టడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మోనాల్‌ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవడంలేదు. అయినా, ఆమెకు మాత్రం ‘పులిహోర’ ఎపిసోడ్స్‌ బాగానే క్రియేట్‌ అవుతున్నాయి. అంతా బిగ్‌బాస్‌ మాయ.

ALSO READ: Monal Gajjar Photoshoot