ENGLISH

నాగ్ సినిమాలో 'బిగ్ బాస్‌' లేడీ!

04 August 2021-11:23 AM

ఎన్ని సినిమాల్లో న‌టించినా, రాని పాపులారిటీ ఒక్క బిగ్ బాస్ తో సంపాదించుకుంది మోనాల్ గ‌జ్జ‌ర్‌. బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే... అల్లుడు అదుర్స్ లో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. అందుకోసం ఏకంగా రూ.15 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్టు టాక్‌. అయితే ఆ త‌ర‌వాత ఎక్కడా మోనాల్ గ‌జ్జ‌ర్ కి అవ‌కాశాలు రాలేదు. బిగ్ బాస్ ది మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారిపోయింది. మోనాల్ మ‌ళ్లీ ఫేడ‌వుట్ అయిపోతోందేమో అనుకుంటున్న ద‌శ‌లో ఇప్పుడు మ‌రో మంచి ఛాన్స్ మోనాల్ ముంగిట వాలింది. త‌న‌కి నాగార్జున సినిమాలో.. అవ‌కాశం ద‌క్కింది.

 

నాగార్జున న‌టిస్తున్న సినిమా `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయిన‌`కి ఇది సీక్వెల్. నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర‌ధారి. కృతి శెట్టి క‌థానాయిక‌. ఈ చిత్రంలో.. ఓ కీల‌క‌మైన పాత్ర‌కు మోనాల్ ని ఎంచుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయిన లో.. అన‌సూయ ఓ పాట‌కు ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. అలాంటి హుషారైన పాత్ర‌లోనే మోనాల్ కూడా క‌నిపించే ఛాన్సుంది. నాగ్ తో సినిమా అంటే... మోనాల్ కి మంచి ఆఫ‌రే అనుకోవాలి. ఈసారైనా నిల‌బెట్టుకుంటుందో లేదో చూడాలి.

ALSO READ: బంగార్రాజు ప‌రుగో ప‌రుగు