ENGLISH

హిట్ కి ఎంత దూరంలో ఉన్నాడు?

19 October 2021-11:36 AM

ఈ ద‌స‌రాకి విడుద‌లైన సినిమాల్లో కాస్త వ‌సూళ్లు ఎక్కువ‌గా తెచ్చుకుంటోంది.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్ర‌మే. అఖిల్ , పూజా హెగ్డే జంట‌గా న‌టించిన సినిమా ఇది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శకుడు. గీతా ఆర్ట్స్ తెర‌కెక్కించింది. గ‌త శుక్ర‌వారం ఈ చిత్రం విడుద‌లైంది. తొలి 4 రోజుల్లో దాదాపు 20 కోట్లు వ‌సూలు చేసింది. నైజాంలో రూ.5.75 కోట్లు, సీడెడ్ లో రూ.3.10 కోట్లు వ‌చ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 18 కోట్లు, ఇత‌ర రాష్ట్రాలు, ఓవ‌ర్సీస్ క‌లుపుకుంటే మ‌రో 2 కోట్లు వ‌చ్చాయి. అలా ఇప్ప‌టి వ‌ర‌కూ 20 కోట్లు తెచ్చుకుంది.

 

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అంటే మ‌రో కోటి తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ కి వ‌చ్చేసిన‌ట్టే. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు కాస్త డ‌ల్ అయ్యాయి. ఈ వారం పెద్ద‌గా సినిమాలేవీ రావ‌డం లేదు. కాబ‌ట్టి... ఈ వారం కూడా బ్యాచిల‌ర్ కి మంచి వ‌సూళ్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఈ వారంలోగా బ్యాచిల‌ర్ ఎంత సాధిస్తాడు? అనేదాన్ని బ‌ట్టే ఈ సినిమా రేంజ్ ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌స్తుతానికి యావ‌రేజ్ టాక్ న‌డుస్తున్నా... మంచి లాభాలు తెచ్చుకుంటే మాత్రం హిట్ జాబితాలో బ్యాచిల‌ర్ ని వేసేయొచ్చు.

ALSO READ: వావ్‌... డిజాస్ట‌ర్ సినిమాని రీమేక్ చేయ‌డ‌మా??