ENGLISH

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం!

23 August 2020-12:26 PM

సినీ అభిమానుల‌కు, నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు ఓ గుడ్ న్యూస్‌. అన్ లాన్ 3.0 లో భాగంగా కేంద్రం షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ... షూటింగుల‌కు సంబంధించిన అనుమ‌తులు రాష్ట్ర ప్ర‌భుత్వ విధి విధానాల‌కు అనుగుణంగా వ‌చ్చాయి.

 

అయితే.. ఇప్పుడు ఇండియా మొత్తం.. షూటింగులు చేసుకునే వెలుసుబాటు వ‌చ్చింది. అయితే కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల్ని పాటించాల్సిందే.

* యూనిట్ మొత్తం మాస్క్‌లు ధ‌రించాలి. కెమెరా ముందున్న న‌టీన‌టులు త‌ప్ప‌.

* షూటింగ్ వ‌ద్ద తాత్కాలిక ఐసొలేష‌న్ కేంద్రం ఏర్పాటు చేయాలి

* మేక‌ప్, హీరో.. హీరోయిన్ల వ్య‌క్తిగ‌త సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా పీపీఈ కిట్ల‌ని వాడాలి

* విజిట‌ర్ల‌ను షూటింగుల‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌దు

* న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణులు అంతా... విధిగా ఆరోగ్య‌సేతు యాడ్ ని డౌన్ లౌడ్ చేసుకోవాలి.

* టికెట్ల‌ని ఆన్ లైన్‌లోనే విక్ర‌యించాలి

* సోష‌ల్ డిస్టెన్స్ ప్ర‌కార‌మే సీట్లను స‌ర్దుబాటు చేయాలి థియేట‌ర్లలో సీట్ల సిట్టింగ్ గురించి కూడా కేంద్రం ప్ర‌త్యేకంగా పేర్కొంది అంటే.. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల రీ ఓపెనింగ్ ని అనుమ‌తులు రావొచ్చ‌న్న సంకేతాలు పంపిన‌ట్టే. అంత‌కంటే శుభ‌వార్త ఏముంటుంది?

ALSO READ: సాయిధ‌ర‌మ్ పెళ్లి కుదిరిందా?