ENGLISH

నాగ్ సినిమాలో అలనాటి ప్రేమకథ

04 January 2024-09:29 AM

నాగార్జున 'నా సామిరంగ'లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే అంజిగా అల్లరి నరేష్ లుక్ వదిలారు. ఇప్పుడు రాజ్ తరుణ్ వంతు. ఇందులో రాజ్ తరుణ్ పాత్ర పేరు భాస్కర్. తనకి ఓ వింటేజ్ లవ్ స్టొరీ వుంది. 1980 నాటి ప్రేమకథ ఇది. రాజ్ తరుణ్ ప్రియురాలి పాత్ర రుక్సార్ పోషించింది.


''కోరుకున్న అమ్మాయి మొహం మీద వచ్చే చిరునవ్వు. అది చూసి మన మనసులో కలిగే ఆనందం. దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్ గారి గోడ ఏంటి? చైనా గోడ దూకిన తప్పు లేదు' అంటూ రాజ్ తరుణ్ తన ప్రేమకథ చెప్పుకొచ్చాడు. కాలేజీ బస్సు, గోల్డ్ స్పాట్కూల్  డ్రింక్, గ్రీటింగ్ కార్డ్ ఇలా అలనాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ చిత్రీకరణ సాగింది. రాజ్ తరుణ్ కి కొన్నాళ్ళుగా సరైన విజయాలు లేవు. ఇప్పుడు నాగార్జున సినిమాలో ఒక ప్రేమకథతో కూడిన పాత్ర దొరకడం విశేషమే. మరి ఇది రాజ్ తరుణ్ కెరీర్ కి ఎంత జోష్ అందిస్తుందో చూడాలి.