ENGLISH

నా సామిరంగ‌ 8 రోజుల వ‌సూళ్లు

22 January 2024-16:09 PM

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. మాస్‌, మ‌సాలా, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సిద్ధ‌మైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంది. నాగ్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ ఇస్తూ మంచి విజ‌యాన్ని అందుకొంది. విడుద‌ల‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ ని ద‌క్కించుకొన్న ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర్నుంచి కూడా మంచి రిట‌ర్న్ రాబ‌ట్టుకొంది. ఇప్పుడు రూ.50 కోట్ల క్ల‌బ్ కి దాదాపుగా చేరువైంది. విడుద‌లైన‌ 8 రోజుల్లో దాదాపు 45 కోట్లు వ‌సూళ్లు సాధించింది.


'నా సామిరంగ' థియేట్రిక‌ల్ రైట్స్‌ని నాగార్జున కేవ‌లం రూ.14 కోట్ల‌కు సొంతం చేసుకొన్నారు. ఇప్ప‌టికి ఈ సినిమాపై దాదాపు రూ.20 కోట్ల పైచిలుకు షేర్ వ‌చ్చింద‌ట‌. అంటే.. నాగ్ రూ.6 కోట్ల లాభంలో ఉన్నార‌న్న‌మాట‌. ఈ వీకెండ్ కూడా కొత్త సినిమాలేం లేవు. అది నా సామిరంగ‌కు ప్ల‌స్ పాయింటే. పైగా ఈవారంలో 'నా సామిరంగ‌'కు మ‌రిన్ని థియేట‌ర్లు పెరిగాయి. కుటుంబ ప్రేక్ష‌కులు 'నా సామిరంగ‌'కు క‌దిలి వ‌స్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ఈ సినిమా ఈవారంలోనే రూ.50 కోట్ల‌కు చేరుకొనే అవ‌కాశం ఉంది. విడుద‌ల‌కు ముందే శాటిలైట్‌, ఓటీటీ రూపంలో ఈ చిత్రం పెట్టుబ‌డి మొత్తం తిరిగి వ‌చ్చింది. దాంతో నిర్మాత హ్యాపీ. ఇప్పుడు నాగార్జున కూడా రిజ‌ల్ట్ ప‌ట్ల సంతోషంగా ఉన్నాడు.