ENGLISH

నాగ‌బాబు ఓటు ప్ర‌కాష్ రాజ్‌కే!

23 June 2021-12:10 PM

`మా`లో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఈసారి ప్ర‌కాష్‌రాజ్‌, జీవిత‌, విష్ణుల మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌బోతోంది. `మా` స‌భ్యుల అండ‌దండలు ఎవ‌రికో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అయితే... ప్ర‌స్తుతానికి నాగ‌బాబు ఓటు మాత్రం ప్ర‌కాష్ రాజ్‌కే అనేది స్ప‌ష్ట‌మైంది. ప్ర‌కాష్ రాజ్ కి తాను సంపూర్ణ‌మైన మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు నాగ‌బాబు ప్ర‌క‌టించారు. ఇది వ‌ర‌కు మా ఎన్నిక‌ల‌లో కూడా... న‌రేష్ ప్యాన‌ల్ కి నాగబాబు స‌పోర్ట్ చేశారు. నాగ‌బాబు ఓటు ప‌డిందంటే.. అది మెగా ఫ్యామిలీ ఓటు కిందే లెక్క‌. చిరు ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌లుకుతారో, వాళ్ల‌ని ద‌గ్గ‌రుండి గెలిపించ‌డం నాగ‌బాబు ప‌ని. ఈసారి ప్ర‌కాష్‌రాజ్ ని గెలిపించే బాధ్య‌త ఆయ‌న తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

 

``ప్ర‌కాష్ రాజ్ లాంటివాడు ముందుకొచ్చి.. `మా` బాధ్య‌త‌లు తీసుకుంటా అని చెప్ప‌డం సంతోషంగా అనిపించింది. నిజానికి `మా`కి అలాంటి వ్య‌క్తి అవ‌స‌రం చాలా ఉంది. మేమే..అత‌ని ఆహ్వానించాల‌నుకున్నాం. కానీ త‌నంత‌ట తాను వ‌చ్చి... పోటీ చేస్తాన‌న‌డం ఆనందంగా ఉంది. త‌న‌ని గెలిపించ‌డానికి కృషి చేస్తా`` అని నాగ‌బాబు ప్ర‌క‌టించారు.

ALSO READ: ధ‌నుష్ రూ.50 కోట్లు అడిగాడా?