ENGLISH

ప్ర‌భాస్ సినిమాలో మెగా బ్ర‌ద‌ర్‌?

24 March 2021-14:24 PM

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బాగానే స్థిర‌ప‌డ్డారు. టీవీ షోలూ, సినిమాలూ అంటూ రెండు చేతులా సంపాదించారు. యూ ట్యూబ్ ఛాన‌ల్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు బుల్లి తెర‌పై ఆయ‌న హ‌డావుడి బాగా త‌గ్గిపోయింది. ఆ గ్యాప్ ని సినిమాల‌తో పూర్తి చేయ‌బోతున్నారు. తాజాగా నాగ‌బాబు ఓ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. వింత వింత గెట‌ప్పుల‌తో ఉన్న నాగ‌బాబు ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. ఇదంతా సినిమా కోస‌మా? లేదంటే స‌ర‌దాకా..? అంటూ మెగా ఫ్యాన్స్ చ‌ర్చించుకున్నారు.

 

ఈ ఫొటోలు స‌ర‌దా కోసం కాద‌ని, సినిమా కోసం గెట‌ప్ ట్రై చేశార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ప్ర‌భాస్ న‌టించిన ఛ‌త్ర‌ప‌తిని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో.. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నాగ‌బాబు పేరుని ప‌రిశీలిస్తున్నార్ట‌. అందులో భాగంగానే నాగ‌బాబుపై ఫొటో షూట్ చేశార‌ని తెలుస్తోంది. అదే గ‌నుక నిజ‌మైతే ఈ సినిమాతో.. మెగా బ్ర‌ద‌ర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం అయిన‌ట్టే.

ALSO READ: ప్ర‌భాస్ ని మ‌ళ్లీ ప‌డ‌గొట్టేశాడు