ENGLISH

వెంకీ మామ కోసం వెనుక‌డుగు వేసిన చైతూ

08 July 2021-11:53 AM

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి తెలుగు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చేయ‌డంతో.. కొత్త సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. జులై 8 నుంచే... ఏపీలో థియేట‌ర్లు తెర‌చుకోవ‌చ్చు. కాక‌పోతే.. ఈనెల చివ‌రి వారంలోనే కొత్త సినిమాల తాకిడి క‌నిపించ‌బోతోంది. అంద‌రి కంటే ముందుగా నాగ‌చైతన్య `ల‌వ్ స్టోరీ`ని విడుద‌ల చేస్తార‌నుకున్నారంతా. ఈనెల 23న ల‌వ్ స్టోరీని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు డిసైడ్ అయ్యారు. అయితే.. వెంక‌టేష్ వ‌ల్ల‌.... `ల‌వ్ స్టోరీ` మ‌రోసారి వాయిదా ప‌డింది.

 

విష‌యం ఏమిటంటే... వెంక‌టేష్ న‌టించిన `నారప్ప‌`ని ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారు. హాట్ స్టార్ లో ఈనెల 24న `నారప్ప‌` స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం. దాని కంటే ఓ రోజు ముందు `ల‌వ్ స్టోరీ` రావడం బాగోద‌ని నిర్మాత‌లు కాస్త వెన‌క్కి త‌గ్గార‌ని తెలుస్తోంది. అందుకే... జులై చివ‌రి వారంలో `ల‌వ్ స్టోరీ`ని విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయ్యార్ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రో వైపు ట‌క్ జ‌గ‌దీష్‌, విరాట‌ప‌ర్వం సినిమాలు కూడా విడుద‌ల‌కు రెడీగా ఉన్నాయి. అతి త్వ‌ర‌లోనే.. ఆయా సినిమాల విడుద‌ల తేదీలు ఖ‌రారయ్యే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: మ‌రో మెగా హీరోని ప‌ట్టిన సురేంద‌ర్ రెడ్డి