ENGLISH

ఈ సారీ చైతూ హిట్‌ కొట్టేలానే ఉన్నాడు

28 August 2017-17:02 PM

ఈ మధ్య చైతూ యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కథలనే ఎంచుకుంటున్నాడు. లేటెస్టుగా చైతూ మరో యూత్‌ ఫుల్‌ మూవీతో వస్తున్నాడు. యూత్‌ ఇన్‌స్పైర్‌ అయ్యే డైలాగ్స్‌ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అదే నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'యుద్ధం శరణం' సినిమాలో. ఆర్‌.వి.కృష్ణ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్య, కృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మంచి విజయం అందుకోనుందని చిత్ర యూనిట్‌ ఆశా భావం వ్యక్తం చేస్తోంది. చైతన్య బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. చైతూని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేశాడు ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌గా డైరెక్టర్‌ కృష్ణ. అందుకే ఈ సినిమాలోని ప్రతీ డైలాగ్‌, ప్రతీ సీన్‌ని చాలా నేచురల్‌గా తెరకెక్కించగలిగాడట. ఓ సామాన్య యువకుడు తన జీవితంలో ఎదురైన పరిస్థితుల కారణంగా హీరోగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. విలన్‌గా సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ నటిస్తున్నాడు. శ్రీకాంత్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా, అంతకన్నా క్రూయల్‌గా డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదివారం రాత్రి ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా ధియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 'మన జీవితాలు ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా అద్భుతంగానే అనిపిస్తుంది. అది మన ప్రపంచం. కానీ ఆ జీవితాల్ని కుదిపేస్తూ ఒక కట్‌ త్రోట్‌ క్రిమినల్‌..' అంటూ చైతూ చెప్పే డైలాగులు సినిమాపై ఆశక్తిని పెంచుతున్నాయి. వరుస విజయాలతో సైలెంట్‌గా దూసుకొస్తున్నాడు చైతూ. సెప్టెంబర్‌ 8న రాబోతున్న 'యుద్ధం శరణం'తో ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలిక.

ALSO READ: అర్జున్ రెడ్డి పై ట్వీట్ కొట్టిన కేటీఆర్ & సమంతా