ENGLISH

ఇది నాగార్జున సినిమా కాదా?

12 January 2022-16:54 PM

ఈ సంక్రాంతికి `బంగార్రాజు`గా వ‌స్తున్నాడు నాగార్జున‌. ఇందులో నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది.కానీ.. ద‌ర్శ‌కుడు మాత్రం `నాగ్‌, చైత‌న్య పాత్ర‌లు రెండూ స‌మానంగానే ఉంటాయ‌ని` చెప్పాడు.ట్రైల‌ర్ చూస్తుంటే అందుకు విరుద్ధంగా క‌నిపిస్తోంది.


ఈ ట్రైల‌ర్‌లో.. నాగార్జున కంటే. నాగ‌చైత‌న్య డామినేష‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ లో ఎక్కువ పార్ట్.. చైతూ మీదే. డైలాగులు కూడా త‌న‌కే ఎక్కువ‌. ఈసారి బంగార్రాజు.. చైతూనే అని, చైతూకి సపోర్ట్ చేసే పాత్ర‌లో నాగ్ క‌నిపిస్తాడ‌ని అర్థం అవుతోంది. అంటే.. ఈ సినిమా లో చైతూ కాద‌న్న‌మాట‌. నాగార్జున‌నే గెస్ట్ రోల్ లో క‌నిపిస్తాడ‌ట‌. ఈ సినిమాని ఏవ‌లం 50 రోజుల్లో పూర్తి చేశాడు క‌ల్యాణ్ కృష్ణ‌. నాగ్ ఇందులో 20 రోజులే కాల్షీట్లు ఇచ్చాడ‌ట‌. అంటే.. 20 రోజుల్లో నాగ్ పాత్ర మొత్తాన్ని పూర్తి చేశాడ‌న్న‌మాట‌. సినిమా చూస్తే గానీ, ఇది చైతూ సినిమానా, నాగ్ సినిమానా, లేదంటే మ‌ల్టీస్టార‌రా?  అనేది అర్థం కాదు. 

ALSO READ: త‌మ‌న్నా ఖాతాలో మ‌రో ఐటెమ్ గీతం