ENGLISH

నెక్స్‌ట్‌ ఆప్షన్‌ ఏంటి బిగ్‌బాస్‌?

28 October 2020-18:15 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 చాలా డల్‌గా సాగుతోంది. హోస్ట్‌ అక్కినేని నాగార్జున తన తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’ షూటింగ్‌ కారణంగా, గత వీకెండ్‌ షోని హోస్ట్‌ చేయలేకపోయిన విషయం విదితమే. నాగ్‌ కోడలు సమంత గత వీకెండ్‌ షోని హోస్ట్‌ చేసింది. తనవరకూ సమంత బాగానే చేసినా, ఆ రియాల్టీ షోకి అందాల్సిన స్థాయిలో ‘పెప్‌’ అందలేదన్నది నిర్వివాదాంశం. ఇక, ఈ వారం పరిస్థితేంటి.? సమంతతోనే నెట్టుకొచ్చేస్తారా? అక్కినేని నాగార్జున.. తిరిగొచ్చే అవకాశముందా? అంటే, ప్రస్తుతానికైతే బిగ్‌బాస్‌ బృందం ‘అన్వేషణ’ గట్టిగానే చేస్తోందని అంటున్నారు.

 

సమంత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీకెండ్‌ షోని హోస్ట్‌ చేసే అవకాశం లేదని అంటున్నారు. మరెలా? బిగ్‌బాస్‌ బృందం చేపడుతున్న ప్రత్యామ్నాయ ఆలోచనలు ఫలితాల్ని ఇస్తాయా? సమంత స్థానంలో వచ్చేది ఎవరు? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. ‘ఎవరు హోస్ట్‌ చేసినా పెద్దగా లాభం వుండదు. ఎందుకంటే, షోలో వుండాల్సిన ఎనర్జీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎవరూ వచ్చి ఏమీ అదనంగా చేయడానికి లేదు..’ అనే చర్చ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో జరుగుతోంది.

 

దివి ఎలిమినేషన్‌ తర్వాత షో మరింతగా డల్‌ అయిపోయిందన్నది నిర్వివాదాంశం. ఇదిలా వుంటే, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. అంటూ కొత్త కొత్త ప్రచారాలు తెరపైకొస్తున్నాయి. కానీ, కరోనా నేపథ్యంలో అంత రిస్క్‌ బిగ్‌బాస్‌ బృందం తీసుకునే అవకాశాలూ చాలా చాలా తక్కువే. కంటెస్టెంట్స్‌ ఎంపిక దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఈసారి ఏదీ కలిసి రాకపోవడం గమనార్హం.

ALSO READ: Samantha Latest Photoshoot