ENGLISH

రజనీ సినిమాలో బాలయ్య??

14 December 2024-10:03 AM

పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ప్రజంట్ సినిమాలన్నీ అదే లెక్కలతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని భాషల నటీనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కాంబి నేషన్స్ చాలా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదొక శుభ తరుణం అని చెప్పొచ్చు. రజనీ కాంత్ 'కూలీ' మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటిస్తున్న RC16 లో శివరాజ్ కుమార్, సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. రజనీ కాంత్ లేటెస్ట్ మూవీ వెట్టయాన్ లో అమితాబ్, రానా, పాహద్ ఫాజిల్ లు నటించారు. ఇప్పడు జైలర్ 2 లో కూడా టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్లు సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రజనీకి మంచి కిక్కిచ్చే పాన్ ఇండియా హిట్ అందించింది జైలర్. జైలర్ లో ఒక్కో భాషనుంచి ఒక్కోక్కరు నటించారు. హిందీ నటుడు జాకీష్రాఫ్, మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ లు భాగం అయ్యారు. ఇప్పడు పార్ట్ 2 కూడా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ లానే జైలర్ 2 లో మిగతా స్టార్స్ ని భాగం చేయాలనీ అనుకుంటున్నారట నెల్సన్. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినిపిస్తోంది.

బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజుతో సంక్రాంతి భరిలో నిలుస్తున్నారు. నెక్స్ట్ అఖండ 2 తో దసరాకి కర్చీఫ్ వేశారు. ఇప్పడు జైలర్ లాంటి మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఈ న్యూస్ విన్న నందమూరి ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. జైలర్ 2 లో బాలయ్య ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నారని టాక్. ఈ మధ్య బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పడు జైలర్ లాంటి మూవీలో ఛాన్స్, అది కూడా గ్యాంగ్ స్టార్ అంటే పూనకాలు లోడింగ్ అన్నట్టు ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.