ENGLISH

నాని సినిమాలో అయిదుగురు హీరోయిన్లు వీళ్లే!

06 July 2021-12:00 PM

నిర్మాత‌గానూ త‌న అభిరుచిని చాటుకుంటున్నాడు నాని. త‌న నిర్మాణంలో వ‌చ్చిన అ, హిట్ చిత్రాలు మంచి విజ‌యాల్ని అందుకున్నాయి. ఇప్పుడు `మీట్ - క్యూట్` అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడు. ఈ సినిమాతో నాని సోద‌రి దీప్తి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతోంది. ఇందులో అయిదురుగు హీరోయిన్లు ఉంటార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఆ హీరోయిన్లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని నాని ఇంత వ‌ర‌కూ చెప్ప‌లేదు. ఒక్కో హీరోయిన్ పేరు.. ఒక్కోసారి రివీల్ చేస్తూ.. స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌నుకుంటున్నాడు నాని. అయితే ఆ అయిదురురెవ‌ర‌న్న‌దీ తెలిసిపోయింది.

 

కాజ‌ల్, నివేదాథామ‌స్‌ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ఎంచుకున్నాడు నాని. శ్ర‌ద్దాదాస్‌, రుహానీ శ‌ర్మ‌, ఆకాంక్ష‌సింగ్ లు కూడా ఇందులో క‌థానాయిక‌ల పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని టాక్‌. ఈ ఐదురురే నాని సినిమాలో ఫిక్స‌య్యార్ట‌. మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌త్య‌రాజ్, శివ కందుకూరి న‌టిస్తున్నారు. అయితే స‌త్య‌రాజ్ త‌ప్ప ఇంకెవ‌రి పేర్లూ అధికారికంగా బ‌య‌ట‌కు రాలేదు.

ALSO READ: ఈ మిష‌న్‌లోకి తాప్సి వ‌చ్చేసింది గా!