ENGLISH

శ్యాం సింగ‌రాయ్‌.. ఇద్ద‌రా.. ఏమా క‌థ‌?

28 October 2020-14:00 PM

నాని క‌థానాయ‌కుడిగా `శ్యామ్ సింగ‌రాయ్‌` అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌కుడు. `టాక్సీవాలా`తో మెగా ఫోన్ ప‌ట్టిన రాహుల్.. తొలి అడుగులోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అందుకే నాని పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చాడు. క‌థానాయిక‌లుగా.... సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టిల‌ను ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ కాస్త బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. శ్యామ్, సింగ‌రాయ్ అనే ఇద్ద‌రి క‌థ ఇది. రెండు పాత్ర‌ల్లోనూ నానినే న‌టిస్తాడు.

 

శ్యామ్ ద‌ర్శ‌కుడైతే, సింగ‌రాయ్ ర‌చ‌యిత‌. అయితే ఇందులో ట్విస్టు ఏమిటంటే.. ఇది పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌. ఓజ‌న్మ‌లోని సింగ‌రాయ్‌. మ‌రో జ‌న్మ‌లో శ్యామ్ గా జ‌న్మిస్తాడు. ఆ లింకేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్టోరీ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. పున‌ర్జ‌న్మ‌ల క‌థంటే టాలీవుడ్ లో హిట్ ఫార్ములా. మూగ మ‌న‌సులు, మ‌గ‌ధీర‌.. ఇలా పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన‌వే. ఈ ఫార్ములా.. నానికి ఎలాంటి రిజ‌ల్ట్ తీసుకొస్తుందో చూడాలి.

ALSO READ: చిరుకీ, ప‌వ‌న్‌కీ అత‌నే కావాల‌ట‌!