ENGLISH

పవిత్రతో నరేష్ పెళ్లి.. వీడియో మాత్రమే

10 March 2023-10:36 AM

సీనియర్‌ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం సంబధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. నరేశ్‌ ఎంతోకాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

 

అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో పెళ్లి కి ఎవరు వచ్చారో ఎవరి సమక్షంలో జరిగిందో వివరాలు ఇవ్వలేదు. గతంలో కూడా ఇలాంటి వీడియో ఒకటి వదిలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. ఎదో సినిమా షూటింగ్ వీడియో అనుకున్నారంతా. ఇప్పుడు వదిలిన వీడియో కూడా సినిమా షూటింగ్ లానే రిచ్ గా వుంది కానీ పెళ్లిపై వివరాలు మాత్రం ఇవ్వలేదు.