ENGLISH

నయనతార హాట్‌ ప్రాపర్టీ

22 August 2017-18:18 PM

ఒకేసారి రెండు ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో నయనతార హీరోయిన్‌గా ఎంపిక కావడం తెలుగు సినీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ మధ్యకాలంలో నయనతారపై చాలా రూమర్స్‌ వచ్చాయి. వాటిల్లో కొన్ని నిజం కూడా. 'బాబు బంగారం' సినిమా ప్రమోషన్‌లో నయనతార ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమెకు వ్యతిరేకంగా చాలా కథనాలు వినిపించాయి. తెలుగు సినిమాల ప్రమోషన్స్‌కి రాకుండా, తమిళ సినిమాల ప్రమోషన్‌కి మాత్రం నయనతార వెళుతోంది. దాంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆమె విషయంలో తెలుగునాట కనిపిస్తోంది. ఇదే విషయం ఆమె ప్రస్తావనకి వెళితే, తెలుగు సినిమాల్లో నటించడం తనకిష్టం లేదనీ కూడా ఆమె చెప్పిందని గుసుగుసలు వినిపించాయి. అయితే ఎన్ని రూమర్స్‌ ఉన్నప్పటికీ, తమిళంలో ఆమె సూపర్‌ బిజీ హీరోయిన్‌ అయినప్పటికీ, తెలుగులో ఇంత బిగ్‌ ఆఫర్స్‌ ఆమెని వెతుక్కుంటూ వెళ్లడం, ఆమె అందుకు అంగీకరించడం ఒకింత టాలీవుడ్‌ని ఆశ్యర్యానికి గురి చేస్తున్న అంశాలే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ 101వ సినిమాలో, అలాగే చిరంజీవి 151వ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోన్న నయనతార ఆ బ్యాడ్‌ రిమార్క్‌ని చెరిపేసుకుంటుందా? చెరిపేసుకుంటే మాత్రం నయనతార మళ్ళీ తెలుగు తెరపై హాట్‌ ప్రాపర్టీ కానుందనడం నిస్సందేహం.

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి