ENGLISH

గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో - న‌య‌న తార పెళ్లి

07 June 2022-10:35 AM

ఇదేంటి? న‌య‌న‌తార పెళ్లేంటి? గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వం ఏమిటి? అనుకుంటున్నారా? మీరు చ‌దివింది క‌రెక్టే. కాదేదీ క‌వితకు అన‌ర్హం అన్న‌ట్టు... ఈ మాయా ప్ర‌పంచంలో వ్యాపారానికి కూడా అన‌ర్హ‌మైన‌దంటూ ఏమీ ఉండ‌దు. ముఖ్యంగా సినీ సెల‌బ్రెటీల‌కు. వాళ్ల పెళ్లిళ్లు కూడా పెట్టుబ‌డే.

 

న‌య‌న‌తార - విఘ్నేష్ ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్నారు. వీళ్ల పెళ్లెప్పుడు? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వీళ్ల పెళ్లికి ముహూర్తం కుదిరింది. పెద్ద పెద్దోళ్ల‌కు ఆహ్వానాలు అందేశాయి. ఈ పెళ్లి త‌తంగాన్నంతా.... గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్‌లో షూట్ చేయ‌బోతున్నారు. ఈ ఫుటేజీని నెట్ ఫ్లిక్స్ కి బేరం పెట్టారు. న‌య‌న పెళ్లి వీడియో చూడాలంటే... నెట్‌ఫ్లిక్స్ చందాదారులై ఉండాల‌న్న‌మాట‌. ప్రీ వెడ్డింగ్ వేడుక‌, మెహందీ.. పెళ్లి.. ఇలా పెళ్లిలోని వివిధ కార్య‌క్ర‌మాల్ని వేర్వేరుగా షూట్ చేసి, నెట్ ఫ్లిక్స్‌కి అందివ్వ‌బోతున్నారు. అందుకుగానూ.. న‌య‌న‌కు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించ‌బోతోంద‌ని టాక్‌. ఈ పెళ్లి త‌తంగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్‌కి కూడా మంచి పారితోషిక‌మే గిట్టుబాటు అవుతోంద‌ని తెలుస్తోంది.

ALSO READ: పాన్ ఇండియా అంటే పోస్టర్ మీద రాసుకోవడం కాదు: నాని