ENGLISH

షారుఖ్ అయినా.. త‌గ్గేది లే!

28 June 2021-16:12 PM

ద‌క్షిణాదిలో అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయిక‌ల్లో న‌య‌న‌తార‌దే అగ్ర‌స్థానం. తెలుగులో కోటిరూపాయ‌ల పారితోషికం అందుకున్న తొలి క‌థానాయిక త‌నే. ఇప్పుడు త‌న పారితోషికం 3 కోట్ల‌కు పైమాటే. హీరో ఎవ‌రైనా స‌రే, త‌న పారితోషికం ఎప్పుడూ త‌గ్గించుకోలేదు. ఇప్పుడూ అంతే. ఈమ‌ధ్య న‌య‌న‌కు బాలీవుడ్ లో ఆఫ‌ర్ వ‌చ్చింది. అందునా షారుఖ్ ఖాన్‌సినిమాలో. అట్లీ దర్శ‌క‌త్వంలో షారుఖ్ న‌టించ‌డానికి ఓకే అన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈచిత్రంలో న‌య‌న‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని స‌మాచారం. న‌య‌న చేస్తున్న తొలి బాలీవుడ్ చిత్ర‌మిదే. పైగా.. షారుఖ్ లాంటి సూప‌ర్ స్టార్ హీరో. ఇలాంట‌ప్పుడైనా న‌య‌న‌తార పారితోషికం తగ్గించుకుంటుంద‌నుకుంటారంతా. కానీ.. న‌య‌న అలా చేయ‌లేదు. స‌రిక‌దా.. పారితోషికాన్ని అమాంతం రెట్టింపు చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం.

 

షారుఖ్ ఖాన్ కోసం సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ నే తీసుకోవాల‌ని ముందునుంచీ అనుకుంటూనే ఉన్నారు. సౌత్ లో న‌య‌న కంటే పెద్ద స్టార్ ఎవ‌రున్నారు? అందుకే న‌య‌న వైపు మొగ్గు చూపించారు. కానీ... న‌య‌న మాత్రం పారితోషికం విష‌యంలో త‌న బెట్టు ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. షారుఖ్ సినిమా అయినా ఈ విష‌యంలో త‌గ్గ‌డం లేదు. న‌య‌న డిమాండ్ అలా వుంది మ‌రి.

ALSO READ: ధ‌నుష్ చేతికి మ‌రో రెండు తెలుగు సినిమాలు