ENGLISH

మళ్ళీ మొదలైన నయన్‌ - విఘ్నేష్‌ పెళ్ళిగోల.

02 September 2020-11:00 AM

హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌.. చాలాకాలంగా ‘సహజీవనం’ చేస్తున్న విషయం విదితమే. ‘మీ పెళ్ళి ఎప్పుడు.?’ అని ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఆ ప్రశ్నలకు స్ట్రెయిట్‌గా ఇంతవరకూ ఈ ఇద్దరూ సమాధానం చెప్పింది లేదు. తాజాగా నయన, విఘ్నేష్‌.. ఓనం సెలబ్రేషన్స్‌ కోసం కేరళ వెళ్ళారు. అక్కడ ఈ ఇద్దరూ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా ఓనంకి కొద్ది రోజుల ముందు, పెళ్ళి గురించి విఘ్నేష్‌ని ప్రశ్నిస్తే, ‘ఆ ప్రశ్న ఇప్పుడు అసందర్భం’ అనేశాడు.

 

మరోపక్క, నయన్‌ - విఘ్నేష్‌ ఆల్రెడీ భార్యాభర్తలకిందే లెక్క.. ఆ ఇద్దరూ ఓనం సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నది భార్యాభర్తల్లానే.. అని కోలీవుడ్‌ జనం చెవులు కొరుక్కుంటున్నారు. పెళ్ళి విషయమై ఈ ఇద్దరూ ఎందుకో ఒకింత మొహమాటం ప్రదర్శిస్తున్నారు.. అదీ మీడియా ముందు మాట్లాడటానికి. సోషల్‌ మీడియాలో మాత్రం నయన్‌, విఘ్నేష్‌ చాలా చాలా క్లోజ్‌గా, చాలా చాలా రొమాంటిక్‌గా కన్పిస్తోన్న విషయం విదితమే. ఇలా ఎన్నాళ్ళు.? అని ప్రశ్నిస్తే, ‘ఇది మాకు బాగానే వుంది.. మేం బాగానే వున్నప్పుడు మీకెందుకు టెన్షన్‌. పెళ్ళి గురించిన నిర్ణయం తీసుకోవాల్సింది మేమిద్దరమే.

 

నిర్ణయం తీసుకున్నాక, పెళ్ళికి మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం..’ అని మీడియా ప్రతినిథుల్ని ఉద్దేశించి సెటైర్లు వేయడం విఘ్నేష్‌కి కొత్తేమీ కాదు. మొత్తమ్మీద, ఓనం సందర్భంగా ఇంకోసారి నయన్‌ - విఘ్నేష్‌ల పెళ్ళి గోల మీడియాకి హాట్‌ టాపిక్‌ అయ్యిందన్నమాట.

ALSO READ: Nayanthara Latest Photoshoot