ENGLISH

ఇస్మార్ట్‌ బ్యూటీ అదరగొట్టేస్తోందక్కడ.!

24 January 2021-12:22 PM

'సవ్యసాచి' భామ నిధి అగర్వాల్‌కు 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో తెలుగులో మంచి బ్రేక్‌ వచ్చింది. అయితే, ఆ తర్వాత కూడా తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేదు. కానీ, తమిళంలో మాత్రం జెట్‌ స్పీడుతో దూసుకెళ్తోంది. ఇటీవలే 'భూమి', 'ఈశ్వరన్‌' చిత్రాలతో మెప్పించింది. లేటెస్ట్‌గా స్టార్‌ హీరో విజయ్‌ సరసన ఓ ఛాన్స్‌ దక్కించుకుందని అంటున్నారు. అలాగే మరో స్టార్‌ హీరో విశాల్‌ దృష్టిని కూడా మన అందాల నిధి ఆకర్షించిందని తెలుస్తోంది.

 

విశాల్‌ తన తాజా చిత్రం కోసం నిధి అగర్వాల్‌ పేరును పరిశీలిస్తున్నాడనీ కోలీవుడ్‌ టాక్‌. క్యూట్‌ అండ్‌ హాట్‌ నిధి అగర్వాల్‌ అంద చందాలకు టాలీవుడ్‌లో ఆదరణ దక్కకపోయినా, తమిళ తంబీల నుండి మాత్రం మంచి ఆదరనే దక్కుతుందనిపిస్తోంది. హాట్‌ హాట్‌ అందాల ఆరబోతతో పాటు, యాక్టింగ్‌ టాలెంట్‌ ప్రదర్శించేలా తమిళంలో మంచి మంచి ఆఫర్స్‌ వస్తుండడంతో నిధి అగర్వాల్‌ ఇక కోలీవుడ్‌లో ఫిక్స్‌ అయిపోయేలా ఉందనిపిస్తోంది.

 

అదే విషయం ఆమె వద్ద ప్రస్ధావిస్తే, తెలుగు ప్రేక్షకులంటే తనకెంతో ఇష్టమనీ, వారి కోసం ప్రత్యేకంగా తెలుగులో మాట్లాడడం కూడా నేర్చుకున్నాననీ, మంచి ఆఫర్‌ వస్తే, తెలుగులో నటించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నాననీ చెబుతోంది అందాల నిధి. ఇక తెలుగులో నిధి అగర్వాల్‌, మహేష్‌ మేనల్లుడు డెబ్యూ చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: Nidhi Agarwal Latest Photoshoot