ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తరువాత నిధి అగర్వాల్ కు మంచి ఆఫర్లే వచ్చాయి. ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అవి కూడా చిన్న సినిమాలేం కాదు శింబు తో ఈశ్వరన్, జయం రవి తో భూమి మరియు ఇతర చిత్రాల్లో కూడా నటిస్తుంది నిధి. కాకపోతే ఇప్పటి వరకు తనకు పోటీగా టాప్ లిస్టులో ఉన్న హీరోయిన్లకు వచ్చిన బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు.
అలాంటి బ్రేక్ రావాలంటే అగ్ర హీరోలతో ఓ సినిమా పడాల్సిందే. అందుకు అనుగుణంగా నిధికి ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చింది, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో రానున్న ఫ్యాన్ ఇండియా చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం పలు పేర్లు వార్తల్లోకి వచ్చాయి.. కానీ అధికారికంగా ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.
తాజాగా నిధి అగర్వాల్ ఓ ప్రముఖ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. తన తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్ తో చేయనుందని.. ఆ అవకాశం రావడం తనకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకొచ్చింది నిధి.
ALSO READ: Nidhi Agarwal Latest Photoshoot