ENGLISH

కోలీవుడ్‌లో ‘ఇస్మార్ట్‌’గా కొల్లగొట్టేస్తోంది.!

11 November 2020-14:08 PM

తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు ఫ్లాప్‌ సినిమాల తర్వాత అనూహ్యంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టింది హాట్‌ అండ్‌ క్యూట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు చేస్తోన్నా, ఈ బ్యూటీకి అనూహ్యమైన గుర్తింపు కోలీవుడ్‌లో దక్కుతోంది. ఓ నాలుగైదు తమిళ సినిమాలతో బిజీగా వున్న నిధి అగర్వాల్‌కి, కోలీవుడ్‌లో షాకింగ్‌ రెమ్యునరేషన్‌ దక్కుతోందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. ఇంత వేగంగా తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు పొందడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

 

కరోనా నేపథ్యంలో కాస్త స్లో అయ్యిందేమోగానీ, లేకపోతే.. నిధి జోరు ఇంకోలా వుండేదని కోలీవుడ్‌ వర్గాలంటున్నాయి. ఇంతకీ, నిధి చేసిన సినిమాలు ఎన్ని తమిళంలో విడుదలయ్యాయి.? అని ప్రశ్నిస్తే, ‘ఆ లెక్కతో అసలు సంబంధమే లేదు.. కానీ, నిధికి మంచి ఫ్యూచర్‌ కోలీవుడ్‌లో వుంది..’ అని కోలీవుడ్‌ సినీ జనం చెబుతున్నారు. తాజాగా హీరో శింబుతో ‘ఈశ్వరన్‌’ సినిమా కోసం ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌లో మునిగిపోయిన నిధి, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుందట.

 

తమిళనాట ఓ మోస్తరు స్టార్‌డవ్‌ు వున్న హీరోయిన్‌కి దక్కే రెమ్యునరేషన్‌ నిధి అగర్వాల్‌కి దక్కుతోందట. దాదాపు కోటికి టచ్‌ అవుతోంది ఆమె రెమ్యునరేషన్‌.. అంటోంది కోలీవుడ్‌. ఏమో, ఈ మాటల్లో నిజమెంతోగానీ, నిధి మాత్రం కోలీవుడ్‌ నుంచి వస్తున్న ఆఫర్లతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. బాలీవుడ్‌ నుంచి వచ్చిన ఈ బ్యూటీ, టాలీవుడ్‌ సంగతెలా వున్నా కోలీవుడ్‌లో బాగానే సెటిలైపోయేలా వుంది.

ALSO READ: మొక్కలు నాటడం మనందరి బాధ్యత : రకుల్ ప్రీతిసింగ్