ENGLISH

మైలు రాయి లాంటి సినిమా

31 July 2020-14:00 PM

హ్యాపీడేస్ తో శేఖ‌ర్ క‌మ్ముల తెలుగు తెర‌కు అందించిన న‌టుడు నిఖిల్‌. స్వామి రారా, కార్తికేయ, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి చిత్రాల‌తో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా నిల‌బ‌డ్డాడు. ప్ర‌స్తుతం కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు...20 సినిమాల మైలు రాయికి చేరువ‌య్యాడు.

 

నిఖిల్ 20 వ సినిమాకి సంబంధించిన స‌న్నాహాలు మొద‌లైపోయాయి. ఈ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్‌, పుష్క‌ర్ రామ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. నిఖిల్ కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని, నిఖిల్ కి ఇది మైలు రాయి లాంటి చిత్రం అవుతుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

ALSO READ: అల్లూ... జ్ఞాప‌కాల్లో...