ENGLISH

అయ్యో పాపం నిఖిల్‌ పరిస్థితేంటీ.?

25 April 2019-16:00 PM

మే 1న నిఖిల్‌ 'అర్జున్‌ సురవరం' విడుదల కావల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నామంటూ ఓ అనౌన్స్‌మెంట్‌ బయటికి వచ్చింది. 'అర్జున్‌ సురవరం' వాయిదా పడడానికి కారణం రేపు రిలీజ్‌ కాబోతున్న హాలీవుడ్‌ మూవీ 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌'. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు సినిమాకి దెబ్బ కొట్టడమంటే చాలా బాధాకరమైన విషయమే. పాపం నిఖిల్‌ తన బాధను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

 

ఎలా ఐతే అవెంజర్స్‌ థానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడతారో, అదే విధంగా స్టూడెంట్స్‌ కోసం పోరాటం చేస్తాడు అర్జున్‌ సురవరం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కాన్సెప్ట్‌కి ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే ఛాన్సుంది. కానీ డిస్ట్రిబ్యూటర్లే సినిమాని రిలీజ్‌ చేసేందుకు నిరాకరించడంతో నిఖిల్‌ చేసేది లేక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పాపం నిఖిల్‌కే ఎందుకిలా జరుగుతోంది. మొన్నేమో ఎంతో ఆశపడి పెట్టుకున్న 'ముద్ర' టైటిల్‌ మార్చుకోవాల్సి వచ్చింది. 

 

ఎలాగో 'అర్జున్‌ సురవరం' అనే టైటిల్‌కి ఫిక్సయితే, ఇప్పుడేమో సినిమా విడుదలకే ఎసరు పడింది. మంచి కాన్సెప్ట్‌ ఉన్న సినిమా మే 1 కార్మికుల దినోత్సవం రోజు విడుదలవుతుందని ఎంతో ఆనందంగా ప్రకటించుకున్న నిఖిల్‌కి ఈ న్యూస్‌ పెద్ద షాకింగే మరి. అందుకే 'డిస్ట్రిబ్యూటర్స్‌ ఇచ్చే మరో మంచి డేట్‌ కోసం మీలానే నేను కూడా ఎదురు చూస్తూ, ఇంతకాలం మిమ్మల్ని వెయిట్‌ చేయించినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నా..' అని అభిమానులనుద్దేశించి నిఖిల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

ALSO READ: ఎన్టీఆర్‌.. చ‌ర‌ణ్‌.. వ‌రుణ్‌... వీళ్లెవ‌రూ కాదా?