ENGLISH

Bhola Shankar: వావ్‌: భోళా శంక‌ర్‌లో నితిన్‌

13 June 2022-12:00 PM

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్‌. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వేదాళం చిత్రానికి ఇది రీమేక్. చిరు సోద‌రిగా... కీర్తి సురేష్ న‌టిస్తోంది. క‌థానాయిక‌గా త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. ఇప్పుడు ఈ టీమ్ లో నితిన్ కూడా చేర‌బోతున్నాడు. కీర్తి సురేష్ ప‌క్క‌న జోడీగా ఓ యువ క‌థానాయ‌కుడు కావాలి. అందుకోసం చిత్ర‌బృందం ఎప్ప‌టి నుంచో అన్వేషిస్తోంది. ఈ ఛాన్స్ నితిన్ కి ద‌క్కింద‌ని స‌మాచారం. నితిన్ రాక‌తో.. ఈ సినిమాకి కొత్త ఫ్లేవ‌ర్ రావ‌డం ఖాయం.

 

నితిన్ - కీర్తి సురేష్‌లు జంటగా `రంగ్‌దే`లో న‌టించారు. ఆ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకొంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకీ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని స‌మ‌చారం. జులై మొద‌టి వారంలో నితిన్ `భోళా శంక‌ర్‌` సెట్లో అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని స‌మాచారం. సింగిల్ షెడ్యూల్ లోనే నితిన్‌పై తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశాలన్నీ పూర్తి చేస్తార్ట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ స్వ‌రాలు అందిస్తున్నారు. భోళాలో నితిన్ ఎంట్రీకి సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లోనే రాబోతోంది.

ALSO READ: ఫ్లాపులొచ్చినా.. ఎక్క‌డా త‌గ్గేదేలే!