ENGLISH

ఒక్క పాత్ర‌... న‌లుగురు పోటీ!

31 October 2020-17:00 PM

`అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజూ మీన‌న్ పాత్ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిక్స‌య్యాడు. అయితే ఫృథ్వీరాజ్‌పాత్ర కి మాత్రం న‌టుడ్ని ఫైన‌లైజ్ చేయ‌డానికి చిత్ర‌బృందం నానా తంటాలూ ప‌డుతోంది. వాళ్ల ద‌గ్గ‌ర ఆప్ష‌న్లు కూడా చాలా ఉన్నాయి.

 

ఫృథ్వీరాజ్ పాత్ర‌లో రానా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రానా అయితే ఆ పాత్ర‌కు బాగుంటాడు కూడా. అయితే.. ఆప్ష‌న్లు కూడా బాగానే పెట్టుకున్నారు. ఓ ఆప్ష‌న్ అయితే.. విజ‌య్ సేతుప‌తి. మ‌రో ఆప్ష‌న్‌... సుదీప్‌. అయితేఇప్పుడు మ‌రో పేరు కూడా వినిపిస్తోంది. త‌నే నితిన్‌. ఫృథ్వీరాజ్ పాత్ర‌ని నితిన్ తో చేయిస్తే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార్ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే నితిన్‌కి పిచ్చి. నితిన్ అంటే.. ప‌వ‌న్‌కీ అభిమానం ఉంది. వీరిద్ద‌రినీ ఒకేసారి వెండి తెర‌పై చూడ్డం బాగుంటుంది కూడా. అయితే పృథ్వీరాజ్‌పాత్ర‌కు నితిన్ ఎంత వ‌ర‌కూ స‌రిపోతాడ‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏదైతేనేం.. ఒక్క పాత్ర‌కు న‌లుగురు నుంచి పోటీ ఎదుర‌వుతోంది. మ‌రి.. చివ‌రికి ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

ALSO READ: నిర్మాత‌ల‌కు షాక్ ఇచ్చిన కాజ‌ల్