ENGLISH

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చిత్రం ''చెక్''

01 October 2020-17:30 PM

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకం పైవి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'చెక్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ' చెక్ ' టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈసినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది . ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు.

 

ఈసినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉంది '' అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- '' నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్ యేలేటిమేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పంథాలోనే ఉంటూవాణిజ్య అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది.

 

రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి.రకుల్ ఇంతకు ముందు మా సంస్థ లో'లౌక్యం' చేసింది. ప్రియా వారియర్ కి తెలుగు లో ఇదే తొలి చిత్రం. ఈ నెల 12 నుంచినెలాఖరువరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతరవిశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం'' అని తెలిపారు.

ALSO READ: చిన్న సినిమాల‌కు గండ‌మే!