ENGLISH

ఇదేం టైటిల్ రా బాబూ..?!

03 November 2021-12:36 PM

టైటిల్ చూసి సినిమా చూడ‌మ‌న్నారు పెద్ద‌లు. టైటిల్ అంత ముఖ్యం. టైటిల్ క్యాచీగా ఉంటే, క‌చ్చితంగా మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయి. అందుకే టైటిల్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. అయితే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ మాత్రం ఓ వెరైటీ టైటిల్ పెట్టింది. అదే.. `శాకినీ డాకినీ`. ఈ సినిమాలో రెజీనా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. అందులో ఒక‌రు శాకిని.. మ‌రోక‌రు డాకినీ అన్న‌మాట‌.

 

దెయ్యాల‌కు సంబంధించిన ఉప‌మానాలు ఇవి. ప‌ల‌క‌డానికి బాగానే ఉన్నా, ఓ సినిమాకి టైటిల్ గా పెట్ట‌డ‌మే కాస్త కొత్త‌గా, వింత‌గా అనిపిస్తోంది. కొరియ‌న్‌ సినిమా మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఓ కిడ్నాప్ డ్రామా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ అంతా రాత్రి వేళ‌ల్లో తీశారు. చిత్రీక‌ర‌ణ‌ దాదాపుగా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఇది వ‌ర‌కు తీసిన `ఓ బేబీ` కూడా కొరియ‌న్ సినిమానే. ఆ సినిమా హిట్ట‌య్యే స‌రికి... సురేష్ బాబుకి కొరియ‌న్‌క‌థ‌ల‌పై దృష్టి ప‌డింది.

ALSO READ: ర‌వితేజ‌కు అంత డిమాండ్ ఏమిట‌బ్బా?