ENGLISH

మెగాస్టార్ కి హీరోయిన్ లేదు

25 April 2022-13:04 PM

చిరంజీవి ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసినప్పుడు కాజల్‌ హీరోయిన్. ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు, ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే సడన్ గా ఈ సినిమా నుంచి కాజల్ మాయమైపోయింది. టీజర్‌, ట్రైలర్‌లలో కాజల్‌ ఎక్కడా కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించడం లేదు.

 

కాజల్ ని తొలగించారా ? ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారా ? అసలు ఆ పాత్రనే తొలగించారా ? అనే చర్చ నడిచింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు కొరటాల. ‘ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. కానీ ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది. చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పాను.

 

‘కథకు ఏది అవసరమో అదే చెయ్‌’ అని చిరు చెప్పారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని.. ‘నేను మీ అందర్నీ మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం’ అని చెప్పింది అలా ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించాం’’ వివరించారు కొరటాల. మొత్తనికి హీరోయిన్ లేకుండా మెగాస్టార్ నుంచి సినిమా రావడం బహుసా ఆయన కెరీర్ లోనే చాలా అరుదని చెప్పాలి.

ALSO READ: విశాఖ‌లో స్టూడియోపై చిరు భిన్న స్వ‌రం