ENGLISH

నోయెల్‌కి ఏమైంది? బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది!

30 October 2020-13:00 PM

ర్యాపర్‌ నోయెల్‌, బిగ్‌ హౌస్‌ నుంచి అనూహ్యంగా, అర్థాంతరంగా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నోయెల్‌ని, బిగ్‌ హౌస్‌ నుంచి బయటకు రావాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించాడు. ట్రీట్‌మెంట్‌ నిమిత్తం తాను బయటకు వెళ్ళాల్సి వస్తోందనీ, అంతకు మించి బిగ్‌బాస్‌ తనకేమీ చెప్పలేదని హౌస్‌మేట్స్‌కి వీడ్కోలు చెబుతూ నోయెల్‌ సీన్‌ చెప్పాడు. అయితే, ‘మీరు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం..’ అని బిగ్‌బాస్‌ చెప్పడంతో కంటెస్టెంట్స్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. స్పెషలిస్ట్‌ వైద్యం అవసరం.. అన్న కోణంలో నోయెల్‌ని బిగ్‌ హౌస్‌ నుంచి బయటకు తెచ్చారు.

 

ప్రస్తుత కోవిడ్‌ కండిషన్స్‌లో ఓ సారి బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి హౌస్‌లోకి అడుగు పెట్టే అవకాశం వుంటుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. కాగా, ప్రత్యేక సౌకర్యాల నడుమ నోయెల్‌ని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అనంతరం కోలుకున్న వెంటనే, అన్ని పరీక్షలు చేసి.. మళ్ళీ అతన్ని హౌస్‌లోకి పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాగా, అసలు నోయెల్‌కి అంత ఇబ్బందికరమైన అనారోగ్య పరిస్థితి ఏంటి.? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. మొదటి నుంచి బిగ్‌హౌస్‌లో నోయెల్‌ ఇబ్బందికరంగానే వుంటోన్న పరిస్థితి గురించి గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్‌. లేకపోతే, నోయెల్‌ ఎనర్జీకి ఈ షో నెక్స్‌ట్‌ లెవల్‌లో వుండాల్సింది. తోటి కంటెస్టెంట్లతో ఎనర్జీ పరంగా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నోయెల్‌కి వచ్చిందంటేనే, అనారోగ్యం కొంచెం తీవ్రమైనదేనని అర్థమవుతోంది.  

ALSO READ: అమీర్‌ఖాన్‌కు కొత్త త‌ల‌నొప్పి