ENGLISH

నోయెల్‌ వర్సెస్‌ మోనల్‌.. వికెట్‌ పడక తప్పదా?

21 October 2020-16:00 PM

నటుడు, ర్యాపర్‌ నోయెల్‌ సీన్‌ ఈ వారం బిగ్‌హౌస్‌ నుంచి ఎలిమినేషన్‌కి డైరెక్ట్‌గా నామినేట్‌ అయిన విషయం విదితమే. మోనాల్‌ గజ్జర్‌ కూడా ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యింది. అరియానా గ్లోరీ, అబిజీత్‌, దివి తదితరులూ నామినేషన్‌లో వున్నప్పటికీ, ఈసారి బిగ్‌హౌస్‌ నుంచి ఎవరు ఎవిక్ట్‌ అవుతారు.? అన్నదానికి సంబంధించి ఎక్కువ చర్చ నోయల్‌ - మోనాల్‌ గురించే జరుగుతోంది. నిజానికి మోనాల్‌ గజ్జర్‌ గత వారమే ఎలిమినేట్‌ అవ్వాల్సి వుంది. కానీ, ఆమెను వ్యూహాత్మకంగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు సేవ్‌ చేశారు. ఆ మాటకొస్తే, గతంలో కూడా మోనాల్‌ గజ్జర్‌కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడూ ఆమె చాలా లక్కీగా బయటపడింది.

 

ఈ వారం మోనాల్‌ గజ్జర్‌ ఎలిమినేషన్‌ తప్పకపోవచ్చని అంటున్నారు. ఆమెను అలా నామినేషన్‌లోకి నెట్టేసింది ఇంకెవరో కాదు అఖిల్‌ సార్థక్‌. ధైర్యంగా అఖిల్‌, నామినేట్‌ అవ్వాల్సింది పోయి.. పిరికితనంతో మోనాల్‌ని నామినేషన్స్‌లోకి నెట్టేశాడు. ఇక, నోయెల్‌ సీన్‌ విషయానికొస్తే.. నోయెల్‌ ఈ మధ్య ఓ సందర్భంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ తప్పుడు సమాచారం ఇచ్చాడనే నెగెటివిటీ ఎక్కువైపోయింది. దాన్ని కవర్‌ చేస్తూ నోయెల్‌ అభిమానులు, ‘ఇదీ వాస్తవం’ అంటూ నోయెల్‌ తండ్రికి సంబంధించి కొన్ని ఫొటోలు రివీల్‌ చేస్తున్నారు. నోయెల్‌ బ్యాక్‌ ఎండ్‌ టీవ్‌ు ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నదానిపైనే ఆయన ఎలిమనేషన్‌ ఆధారపడి వుంటుంది.

ALSO READ: హారిక, అఖిల్‌.. ఏం ఓవరాక్షన్‌ బాసూ!